బాహుబలి టికెట్ల కోసం ధర్నా | rana fans stage dharna for movie tickets of baahubali | Sakshi
Sakshi News home page

బాహుబలి టికెట్ల కోసం ధర్నా

Jul 6 2015 7:57 PM | Updated on Sep 3 2017 5:01 AM

బాహుబలి టికెట్ల కోసం ధర్నా

బాహుబలి టికెట్ల కోసం ధర్నా

తమ అభిమాన హీరో రానా.. విలన్ పాత్రలో నటించిన బాహుబలి సినిమా టికెట్లు లభించకపోయే సరికి వారు తట్టుకోలేకపోయారు. టికెట్లు అయిపోయాయని థియేటర్ సిబ్బంది చెప్పడంతో ధర్నాకు దిగారు.

తమ అభిమాన హీరో రానా.. విలన్ పాత్రలో నటించిన బాహుబలి సినిమా టికెట్లు లభించకపోయే సరికి వారు తట్టుకోలేకపోయారు. టికెట్లు అయిపోయాయని థియేటర్ సిబ్బంది చెప్పడంతో ధర్నాకు దిగారు. కరీంనగర్ పట్టణంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది.

రానా అభిమానుల సంఘం కిరుపాల్ సింగ్ ఆధ్వర్యంలో కొంత మంది థియేటర్ ముందు కూర్చుని ధర్నా చేశారు. ఈ నెల 10న బాహుబలి సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టికెట్ల కోసం అభిమానులు ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాటి అమ్మకం మొదలుపెట్టిన కొద్ది సేపటికే అయిపోతుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అడపాదడపా ఇలాంటి ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement