breaking news
fans dharna
-
అభిమానిని నెట్టేసిన బాలకృష్ణ
-
అభిమానులను తన్నిన బాలయ్య
తల్లాడ: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తమను కాలితో తన్నారని ఆరోపిస్తూ ఆయన అభిమానులు ఫ్లెక్సీలను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాలకృష్ణ ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మిట్టపల్లి వెళ్లారు. అక్కడ అభిమానులు బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. వ్యాన్‌పై నుంచి దిగి షేక్ లాలు, రమేష్, కృష్ణయ్యలను కాలితో తన్నారు. అనంతరం కల్లూరు వెళ్లారు. బాలయ్య వైఖరిపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగులబెట్టారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఆందోళన చేస్తామని అభిమానులు భీష్మించుకొని కూర్చున్నారు. తాము అభిమానంతో వస్తే తన్నడం ఏమిటని ప్రశ్నించారు. బాలయ్య చేయి చేసుకున్నారు: లాలు అభిమానంతో చూద్దామని వస్తే నాపై బాలయ్య చేయి చేసుకున్నాడు. వ్యాన్‌పై నుంచి కిందకు దిగి వచ్చి ఆగ్రహంతో మెడ పై చేత్తో కొట్టాడు. మరికొంత మందిని కాలితో తన్నాడు. మా అభిమానానికి బహుమానంగా బాలయ్య దురుసుగా ప్రవర్తించడం బాధగా ఉంది. -
బాహుబలి టికెట్ల కోసం ధర్నా
తమ అభిమాన హీరో రానా.. విలన్ పాత్రలో నటించిన బాహుబలి సినిమా టికెట్లు లభించకపోయే సరికి వారు తట్టుకోలేకపోయారు. టికెట్లు అయిపోయాయని థియేటర్ సిబ్బంది చెప్పడంతో ధర్నాకు దిగారు. కరీంనగర్ పట్టణంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. రానా అభిమానుల సంఘం కిరుపాల్ సింగ్ ఆధ్వర్యంలో కొంత మంది థియేటర్ ముందు కూర్చుని ధర్నా చేశారు. ఈ నెల 10న బాహుబలి సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టికెట్ల కోసం అభిమానులు ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాటి అమ్మకం మొదలుపెట్టిన కొద్ది సేపటికే అయిపోతుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అడపాదడపా ఇలాంటి ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.