సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తమను కాలితో తన్నారని ఆరోపిస్తూ ఆయన అభిమానులు ఫ్లెక్సీలను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాలకృష్ణ ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మిట్టపల్లి వెళ్లారు. అక్కడ అభిమానులు బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. వ్యాన్‌పై నుంచి దిగి షేక్ లాలు, రమేష్, కృష్ణయ్యలను కాలితో తన్నారు. అనంతరం కల్లూరు వెళ్లారు. బాలయ్య వైఖరిపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగులబెట్టారు.