అభిమానులను తన్నిన బాలయ్య  | Balayya Fans angry on Bala Krishna | Sakshi
Sakshi News home page

అభిమానులను తన్నిన బాలయ్య 

Oct 2 2018 3:57 AM | Updated on Oct 2 2018 4:46 PM

Balayya Fans angry on Bala Krishna - Sakshi

టీడీపీ జెండాలను తగులపెడుతున్న అభిమానులు

తల్లాడ: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తమను కాలితో తన్నారని ఆరోపిస్తూ ఆయన అభిమానులు ఫ్లెక్సీలను తగులబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాలకృష్ణ ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మిట్టపల్లి వెళ్లారు. అక్కడ అభిమానులు బాలకృష్ణ కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. వ్యాన్‌పై నుంచి దిగి షేక్‌ లాలు, రమేష్, కృష్ణయ్యలను కాలితో తన్నారు. అనంతరం కల్లూరు వెళ్లారు. బాలయ్య వైఖరిపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ.. టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగులబెట్టారు.  

బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి  
బాలకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఆందోళన చేస్తామని అభిమానులు భీష్మించుకొని కూర్చున్నారు. తాము అభిమానంతో వస్తే తన్నడం ఏమిటని ప్రశ్నించారు. 

బాలయ్య చేయి చేసుకున్నారు: లాలు
అభిమానంతో చూద్దామని వస్తే నాపై బాలయ్య చేయి చేసుకున్నాడు. వ్యాన్‌పై నుంచి కిందకు దిగి వచ్చి ఆగ్రహంతో మెడ పై చేత్తో కొట్టాడు. మరికొంత మందిని కాలితో తన్నాడు. మా అభిమానానికి బహుమానంగా బాలయ్య దురుసుగా ప్రవర్తించడం బాధగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement