హాలీవుడ్ సినిమాలో రానా | Rana Daggubatis next will feature a Hollywood actress! | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరో

Jul 30 2017 12:53 PM | Updated on Sep 5 2017 5:13 PM

హాలీవుడ్ సినిమాలో రానా

హాలీవుడ్ సినిమాలో రానా

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాల్ యాక్టర్ రానా.. మరో ఘనతను

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాల్ యాక్టర్ రానా.. మరో ఘనతను అందుకోబోతున్నాడు. త్వరలో రానా హీరోగా ఓ హాలీవుడ్ సినిమా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించాడు. లీడ‌ర్ సినిమాతో వెండితెరకు ప‌రిచ‌య‌మైన రానా టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా బాహుబలి సినిమా జాతీయ స్థాయిలో మార్కెట్ సాధించటంలో రానా పాత్ర కీలకం. ఈ విషయాన్ని రాజమౌళి కూడా పలు సందర్భాల్లో ప్రస్థావించాడు.  హీరోయిజాన్ని పక్కన పెట్టి డిఫరెంట్ రోల్స్లో న‌టిస్తున్న రానా లండ‌న్ డిజిట‌ల్ మూవీ మ‌రియు టీవి స్టూడియోస్ తో క‌లిసి లండ‌న్ బేస్డ్ మూవీ చేయ‌నున్నాడు. ఎల్ డీ ఎమ్ తో క‌లిసి ఫిలిం మేకింగ్లో బెట‌ర్ టెక్నాలజీ తీసుకురాబోతున్నట్టు తెలిపాడు. త్వర‌లోనే ప్రారంభం కానున్న ఈసినిమాలో రానా సరసన హాలీవుడ్ హీరోయిన్ నటించనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement