బాహుబలి కోసం భారీ కసరత్తులు | Rana Daggubati Body Workouts | Sakshi
Sakshi News home page

బాహుబలి కోసం భారీ కసరత్తులు

Feb 10 2016 9:58 AM | Updated on Apr 3 2019 5:45 PM

బాహుబలి కోసం భారీ కసరత్తులు - Sakshi

బాహుబలి కోసం భారీ కసరత్తులు

నిన్న సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియోతో సందడి చేసిన సోషల్ మీడియా ఇప్పుడు రానా జిమ్ వీడియోతో హల్ చల్ చేస్తోంది. సమంత వీడియోను అప్ లోడ్ చేసిన కునాల్ గిర్, రానా బాహుబలి కోసం...

నిన్న సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియోతో సందడి చేసిన సోషల్ మీడియా ఇప్పుడు రానా జిమ్ వీడియోతో హల్ చల్ చేస్తోంది. సమంత వీడియోను అప్ లోడ్ చేసిన కునాల్ గిర్, రానా బాహుబలి కోసం రెడీ అవుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారీ చైన్‌లతో రానా కసరత్తులు చేస్తున్న వీడియో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆకర్షిస్తోంది.

రానా బాడీ బిల్డింగ్ వీడియోపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ కన్నా నీ లుక్ బాగుందంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఘాజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రానా, ఆ సినిమాతో పాటు బాహుబలిలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి 2 ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement