మస్త్‌ బిజీ | Rana with Chandrasekhar Yeleti new movie | Sakshi
Sakshi News home page

మస్త్‌ బిజీ

Dec 8 2018 12:39 AM | Updated on Aug 11 2019 12:52 PM

Rana with Chandrasekhar Yeleti new movie - Sakshi

రానా

‘1945 (తమిళంలో ‘మడైతిరందు’), అరణ్య (తమిళంలో ‘కాడన్‌’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’),  ‘మార్తాండ వర్మ: ది కింగ్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌’, కోడి రామ్మూర్తి బయోపిక్, హిరణ్య కశ్యప, యన్టీఆర్‌ బయోపిక్‌... ఇది హీరో రానా చేతిలో ఉన్న సినిమాల లిస్ట్‌. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారంటే ఆశ్చర్యపోరు కదా. మరి.. ఆయన ప్లానింగ్‌ అలా ఉంది. రానా హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ సినిమా రూపొందనుందని సమాచారం.

‘ఐతే..’, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, మనమంతా’ వంటి భిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్‌ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇందులో రానా క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇలా వచ్చే ఏడాది రానా డైరీ ఫుల్‌గా ఉంది. అయితే..‘1945, అరణ్య, యన్టీఆర్‌ బయోపిక్‌’ సినిమాల్లో రానా పాత్రలకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ఇక.. మిగిలిన సినిమాలు కాస్త అటూ ఇటుగా సెట్స్‌పైకి వేళ్లే అవకాశం ఉందని ఊహించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement