మనోజ్, జగపతి బాబులతో వర్మ 'ఎటాక్' | Ramgopal varma 'attack's with manoj and jagapathi babu | Sakshi
Sakshi News home page

మనోజ్, జగపతి బాబులతో వర్మ 'ఎటాక్'

May 30 2015 6:30 PM | Updated on Sep 3 2017 2:57 AM

మనోజ్, జగపతి బాబులతో వర్మ 'ఎటాక్'

మనోజ్, జగపతి బాబులతో వర్మ 'ఎటాక్'

మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లాంటి అగ్రశ్రేణి తారాగణంతో రాంగోపాల్ వర్మ 'ఎటాక్' అనే కొత్త సినిమా తీస్తున్నారు.

రాంగోపాల్ వర్మ ఈ మధ్య చాలా బిజీబిజీగా ఉంటున్నారు. సినిమాల మీద సినిమాలు తెగ తీసేస్తూ ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే '365 డేస్' సినిమాను విడుదల చేసిన ఆయన.. ఇప్పుడు మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లాంటి అగ్రశ్రేణి తారాగణంతో 'ఎటాక్' అనే కొత్త సినిమా తీస్తున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.  సినిమా మోషన్ పోస్టర్ను యూట్యూబ్ ద్వారా పరిచయం చేశారు. ఇందులో మళ్లీ ప్రకాష్ రాజ్ 'అంతఃపురం' లాంటి పాత్రలో కనిపించేలా ఉన్నారు. మనోజ్, జగపతి బాబు కూడా పూర్తి ఫైర్ చూపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తానని కూడా రాంగోపాల్ వర్మ చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement