ఎన్టీఆర్‌ సినిమాలో సీనియర్‌ హీరోయిన్‌ | Rambha In Jr Ntr And Trivikram Film | Sakshi
Sakshi News home page

May 16 2018 11:59 AM | Updated on May 16 2018 1:32 PM

Rambha In Jr Ntr And Trivikram Film - Sakshi

జై లవ కుశ సినిమాతో మంచి విజయం సాధించిన ఎన్టీఆర్‌ కొంత విరామం తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తొలి షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించిన త్రివిక్రమ్, రెండో షెడ్యూల్‌లో ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్రకు సీనియర్‌ను హీరోయిన్‌ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సీనియర్‌ హీరోయిన్లకు మంచి గుర్తింపు వచ్చింది. అత్తారింటికి దారేదిలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అజ్ఞాతవాసిలో ఖుష్బూలు కీలక పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా కోసం మరో సీనియర్‌ హీరోయిన్ రంభను తీసుకున్నాడట త్రివిక్రమ్‌.

ఎన్టీఆర్ సరసన నాగ, యమదొంగ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన రంభ ఇప్పుడు తన సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. త్వరలోనే రంభ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొననుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement