ఫుల్ బిజీగా ఎనర్జిటిక్ హీరో | Ram Signs For Three New Scripts | Sakshi
Sakshi News home page

ఫుల్ బిజీగా ఎనర్జిటిక్ హీరో

Jul 2 2016 12:46 PM | Updated on Sep 4 2017 3:59 AM

ఫుల్ బిజీగా ఎనర్జిటిక్ హీరో

ఫుల్ బిజీగా ఎనర్జిటిక్ హీరో

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రామ్ మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. నేను శైలజ తరువాత ఏ తరహా కథ చేయాలో అర్ధం కాక చాలా రోజులు పాటు ఖాళీగానే ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

సంతోష్ శ్రీనివాస్ సినిమా పూర్తవ్వగానే పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఆ తరువాత మరోసారి నేను శైలజతో తన బ్రేక్ ఇచ్చిన కిశోర్ తిరుమలతో కలిసి పనిచేసే  ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. ఒక్కో సినిమాకు నాలుగు నెలల సమయం పట్టినా.. కనీసం మరో ఏడాదిన్నర పాటు రామ్ యమ బిజీగా గడపనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement