శివమ్ వీరంగమ్ | ram shivam movie shooting in hyderabad | Sakshi
Sakshi News home page

శివమ్ వీరంగమ్

Aug 3 2015 12:13 AM | Updated on Mar 19 2019 7:01 PM

శివమ్ వీరంగమ్ - Sakshi

శివమ్ వీరంగమ్

ఎనర్జీకి చిరునామా అన్నట్లుగా ఉంటారు రామ్. ఇప్పటివరకూ ఎన్నో ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ చేసిన ఆయన ‘శివమ్’లో మరింత ఎనర్జిటిక్‌గా వీరంగమ్ చేయనున్నారు.

 ఎనర్జీకి చిరునామా అన్నట్లుగా ఉంటారు రామ్. ఇప్పటివరకూ ఎన్నో ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ చేసిన ఆయన ‘శివమ్’లో మరింత ఎనర్జిటిక్‌గా వీరంగమ్ చేయనున్నారు. ఎందుకంటే, ఇది హై ఓల్టేజ్ లవ్‌స్టోరీ మూవీ. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్, రాశీఖన్నా జంటగా స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బుధవారంతో ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందని, పాటలు మినహా టాకీ పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. మూడు పాటల చిత్రీకరణను నార్వే, స్వీడెన్‌లో జరపనున్నారు. ఈ నెల 18న ఈ చిత్రీకరణ ప్రారంభించనున్నామని నార్వే, స్వీడెన్‌లలో ‘రంగం’ పాటలను చిత్రీకరించినకలర్‌ఫుల్ లొకేషన్స్‌లో ‘శివమ్’ పాటలను చిత్రీకరించనున్నామని రవికిశోర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకూ ఈ చిత్రీకరణ జరుగుతుందని కూడా చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సమర్పణ: కృష్ణచైతన్య.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement