పాటల చిత్రీక‌ర‌ణ‌లో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’

Ram Pothineni and Puri Jagannadh iSmart Shankar in Song Shoot - Sakshi

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. ప్రస్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ  షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది యూనిట్‌. బుధ‌వారం నుండి హైద‌రాబాద్‌లో వేసిన సెట్‌లో పాటల చిత్రకరణ ప్రారంభించారు.

‘దిమాక్ ఖ‌రాబ్‌..’ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాట‌కు శేఖ‌ర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాటలో హీరో రామ్ మ‌రోసారి అదిరిపోయే స్టెప్పుల‌తో మెప్పించ‌నున్నాడట. కాస‌ర్లశ్యామ్ రాసిన ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ సంగీతమందించగా కీర్తన శ‌ర్మ‌, సాకేత్ ఆలపించారు.

రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కౌర్ నిర్మాత‌లుగా రూపొందిస్తున్న ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top