'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ | Ram, Kishore Tirumala to team up again | Sakshi
Sakshi News home page

'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ

Sep 18 2016 11:17 AM | Updated on Sep 4 2017 2:01 PM

'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ

'నేను శైలజ' కాంబినేషన్లో మరో మూవీ

నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమాను పూర్తి చేసిన రామ్ ప్రస్తుతం ఆ సినిమా...

నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో హైపర్ సినిమాను పూర్తి చేసిన రామ్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్కు కిక్ ఇచ్చిన కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే వెంకటేష్తో సినిమా కమిట్ అయిన కిశోర్, రామ్తో సినిమాను మొదలెట్టడానికి కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. మరి ఈ గ్యాప్ లో రామ్ మరో సినిమా చేస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement