-
మంచి మాట: అతి అనర్థమే!
‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే అతి ఎల్లవేళలా విడిచిపెట్టాలి అని పెద్దలు ఏనాడో చెప్పారు. అతి అన్న మాటకు ఎక్కువగా, అధికంగా, అవసరమైన దానికన్నా అని అర్థం. అవసరానికి మించినది ఎక్కువ ఏ విషయంలోనూ కూడదని దీని తాత్పర్యం. మన నడతలో, ఆహార్య ఆహారాదులలో, భాషణ, భూషణాది విషయాలలో ఒక హద్దు, నియమం ఒక పరిమితి ఉండాలి. అంతకుమించి పోరాదు. పరిమితి, హద్దు అనేవి ప్రకృతికే కాదు, మనిషి జీవితానికి అవసరం. అవి మనకొక క్రమాన్ని, హద్దును ఏర్పరచి జీవితం, సత్సంబంధాలు హాయిగా కొనసాగేటట్టు చేస్తాయి. మనిషి నాగరికతను, సంస్కారాన్ని సూచించేవి దుస్తులు. సభ్యతతో సమాజంలో సంచరించటానికి చక్కని వస్త్రధారణ కావాలి. అవి మనకు ఒక హుందాను, నిండుదనాన్ని ఇవ్వాలి. సరైన కొలతలతో ఉన్న దుస్తులు మన ఒంటికి చక్కగా అమరుతాయి. అందాన్నిస్తాయి. పరిమాణంలో అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉన్న ఉడుపులు చూపరులకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది. ఉత్సాహాన్నిచ్చి మన పనులు చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఆహారం మనకు అందించే కేలరీలు శరీరానికవసరమైన స్థాయిలో ఉంటే చక్కని ఆరోగ్యం. ఇవి అతిగా ఉంటే ఊబకాయం. పనులు చేసుకోవటం కష్టమవుతుంది. అలాగే వీటి సంఖ్య తగ్గితే అనారోగ్యమే. ఈ కేలరీలను నియంత్రించుకోవాలంటే జిహ్వను అదుపులో పెట్టుకోవాలి. ‘నాలుక కోరుతోంది కాబట్టి తింటాను’ అనే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే మితమైన లేదా సరిపడా ఆహారం తీసుకోవాలి. అలసిన శరీరం మళ్లీ శక్తిని పుంజుకుని, మరుసటి రోజు పనులకు ఆయత్తమవాలంటే నిద్ర మనకు చాలా అవసరం. సేదతీరిన కాయం కొంత సమయం తరువాత చైతన్యవంతమవుతుంది. మన దినచర్య లోకి వెళ్ళమని సూచిస్తుంది. కొంతమంది అవసరమైన సమయంకన్నా ఎక్కువసేపు నిద్రపోతుంటారు.అటు వంటివారిలో ఒక మందకొడితనం వస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గి చైతన్యం మటుమాయం అవుతుంది. ఈ దురలటువాటు మన జీర్ణ వ్యవస్థను ఛిద్రం చేస్తుంది అందుకే అతినిద్ర చేటు అని వివేకవంతులు చెప్పారు. ‘కేయురాణి న భూష యంతిం’ అన్న శ్లోక భావార్థం ఇదే. పెద్దలు, పండితులు, మహానుభావుల సమక్షంలో ఒదిగి, వినమ్రంగా ఉండాలి. వినయంతో సంచరించాలి. ఇది వారి జీవితానుభవాన్ని, విద్వత్తును, ఘనతను గుర్తెరిగి ప్రవర్తించటం. కొందరు అవసరానికి మించిన వినయాన్ని చూపిస్తారు. అది ధూర్తుల లక్షణం. వీరి అతివినయపు లక్ష్యం ఒక స్వార్థ ప్రయోజనమే. వినయాన్ని చూపుతూనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అపుడే దానికొక ఒక గౌరవం, ప్రశంస. అతిపరిశుభ్రత వల్ల సమయం, శక్తి వృథా. అతి ప్రేమ, కాముకత, అహంకారం, జాత్యహంకారం వల్ల ఎందరో, ఎన్నో దేశాలు నాశనమయ్యాయో చెప్పే చరిత్ర పాఠాలు విందాం. మనిషికి మాత్రమే ఉన్న అద్భుత ఆలోచనా శక్తి అతణ్ణి జంతుప్రపంచం నుండి విడిపడేటట్టు చేసింది. భాషను కనుగొనేటట్టు చేసింది. దీనికితోడు, సృష్టిలో ఏ ఇతరప్రాణికి లేని అతడి స్వరపేటిక, నాలుక, ఊపిరితిత్తుల కుదురైన అమరిక అతడి భావోద్వేగాలను వ్యక్తం చేసే గొప్పసాధనమైంది. సందర్భానికి కావలసిన అర్థవంతమైన మాటలను మనలో ఎంతమంది వాడగలరు? వేళ్ళమీద లెక్కపెట్టగలిగే వారే కదా! చాలామంది అధిక ప్రసంగం చేసేవారే. క్లుప్తత, ఔచిత్యత, వివేచనలతో సందర్భశుద్ధిగా భాషించే వాళ్ళు మనలో చాలా తక్కువమందే. ఈ వదరుబోతుల వల్ల కాలహరణమే కాక సంభాషణ పెడదారి పడుతుంది. అందుకే మాట్లాడటం ఒక కళ అన్నారు. అది కొందరికే అలవడుతుంది. అపుడు భాషణం గొప్ప భూషణమే అవుతుంది. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
కిశోర్కే ఓటేసిన రామ్
నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ హైపర్ తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. హైపర్ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేశాడు రామ్. అందుకే మరోసారి నేను శైలజ కాంబినేషన్ నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావించినా.. ఇప్పుడే ప్రయోగం చేయటం ఇష్టం లేని రామ్ సేఫ్ గేమ్ కే మొగ్గుచూపుతున్నాడు. అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్‌కు కిక్ ఇచ్చిన, కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్. ఆ సినిమా ఆగిపోవటంతో రామ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాశాడు. రామ్ హోం బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్
నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతో పాటు ప్రైవేట్ పార్టీస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న రామ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓ అభిమాని రామ్.., నెక్ట్స్ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నానంటూ రామ్ కు ట్విట్టర్ లో మెసేజ్ చేశాడు. ' రామ్ అన్నయ్య, ఈ రోజు నుంచి మీ నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నాను. ఇది మొదటి రోజు లవ్ యు' అంటూ తరుణ్ సాయి ప్రకాష్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన రామ్, ' ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు తమ్ముడు, నేను అదే పనిలో ఉన్నా' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు రామ్. @ramsayz annaya iam going to start fasting from 2day onwards till we get an announcement of ur nxt project iam saying it for sure DAY1 loveU — tarun_sai_prakash (@starun01) 21 February 2017 Illanti kotha tensions pettaku thammudu..im on it #love https://t.co/G1xbMUXXIB — Ram Pothineni (@ramsayz) 21 February 2017 -
‘అమృత’లో హైపర్ సందడి
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని అమృత థియేటర్లో సోమవారం సాయంత్రం ‘హైపర్’ చిత్రం యూనిట్ సందడి చేసింది. ఫస్ట్ షో ఇంటర్వెల్ సందర్భంగా థియేటర్లో చిత్రం హీరో రామ్, హీరోయిన్ రాశీఖన్నా ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ‘మీరు హైపర్ సినిమా చూసేందుకు వస్తే మేము మీ హైపర్ చూద్దామని వచ్చాం.’ అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. కొంతమంది అభిమానుల కోరిక మేరకు సినిమాలోని కొన్ని డైలాగ్‌లు చెప్పారు. హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ ‘అభిమానులు లేనిదే మేము లేము. మాపై అభిమానంతో సినిమాను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అన్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ సెల్ఫోన్లలో హీరో, హీరోయిన్ల ఫొటోలను బంధించేందుకు పోటీపడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట, సుంకర అనిల్, సురక్ష ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి ప్రకాష్, థియేటర్ యాజమాన్యం ఎ.రవీందర్రావు, పాల్గుణ్, మేనేజర్ మోహన్‌రావు, కార్పొరేటర్ బోడ డిన్న పాల్గొన్నారు. -
'హైపర్' మూవీ రివ్యూ
టైటిల్ : హైపర్ జానర్ : యాక్షన్ కామెడీ తారాగణం : రామ్, రాశీఖన్నా, సత్యరాజ్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎనర్జిటిక్ స్టార్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నా.. భారీ కలెక్షన్లు సాధించే స్థాయి కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన రామ్, హైపర్ సినిమాతో మరోసారి తనలోని ఎనర్జి లెవల్స్‌ను చూపించేందుకు రెడీ అయ్యాడు. నేను శైలజ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న రామ్, తిరిగి తన పాత మాస్ జానర్లో చేసిన ఈ సినిమా.. రామ్ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసిందా..? రభస ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రామ్‌తో కలిసి హిట్ ఇచ్చాడా..? కథ : అంతా సూరి అనే పిలిచే సూర్య (రామ్) హైపర్ కుర్రాడు. ఎంతో నిజాయితీగా పనిచేసే ప్రభుత్వోద్యోగి నారాయణ మూర్తి(సత్యరాజ్) కొడుకు సూరి. సూరికి తండ్రి అంటే ఎంతో ప్రేమ.. అప్పుడప్పుడు ఆ ప్రేమ నారాయణ మూర్తిని ఇబ్బంది పెట్టే స్థాయిలో కూడా ఉంటుంది. ఉద్యోగి నారాయణమూర్తి పదవీ విరమణ సమయం దగ్గర పడుతున్న సమయంలో మినిస్టర్ రాజప్ప( రావూ రమేష్) తన కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఇబ్బంది పెడతాడు. అయితే నిబందనలకు విరుద్ధంగా ఉందన్న కారణంతో నారాయణ మూర్తి పర్మిషన్ ఇచ్చేందుకు అంగీకరించడు. అప్పుడు మినిస్టర్ రాజప్ప ఏం చేశాడు..? నారాయణ మూర్తి సమస్య తెలుసుకున్న కొడుకు సూరి రాజప్పను ఎలా ఎదుర్కొన్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన హై ఎనర్జీ పర్ఫామెన్స్ తో రామ్ సినిమాలో స్పీడు మరింత పెంచాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను బాగా పండించిన ఎనర్జిటిక్ స్టార్, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. రాశీఖన్నాకు నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఇక మధ్యతరగతి తండ్రిగా నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. రామ్, సత్యరాజ్‌ల నటన సినిమాకు మేజర్ హైలెట్‌గా చెప్పుకోవచ్చు. విలన్‌గా రావూ రమేష్ నటన సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. కామెడీ పండిస్తూనే విలనిజాన్ని చూపించాడు. సాంకేతిక నిపుణులు : ఈ సారి ఎలాగైన సక్సెస్ కొట్టాలన్న కసితో సినిమా చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాను తెరకెక్కించాడు. రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్‌ను ఎంటర్టైనింగ్గా నడిపించాడు. కానీ సెకండాఫ్ విషయంలో మాత్రం కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు లవ్ ట్రాక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. అదే సమయంలో అనవసరమైన సిచ్యువేషన్స్‌లో పాటలు రావటం కూడా ఇబ్బందిగా మారింది. గిబ్రాన్ సంగీతం, మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 14 రీల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రదారుల నటన ఫస్ట్ హాఫ్ కామెడీ మైనస్ పాయింట్స్ : రొటీన్ లైన్ సెకండ్ హాఫ్ పాటలు ఓవరాల్‌గా హైపర్ కాస్త రొటీన్ అనిపించినా.. అలరించే కామెడీ ఎంటర్టైనర్
Pagination
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
Advertisement