రామ్ హైపర్ ఫస్ట్ లుక్ | Ram Hyper First look | Sakshi
Sakshi News home page

రామ్ హైపర్ ఫస్ట్ లుక్

Aug 3 2016 10:24 AM | Updated on Sep 4 2017 7:40 AM

రామ్ హైపర్ ఫస్ట్ లుక్

రామ్ హైపర్ ఫస్ట్ లుక్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ హైపర్. నేను శైలజ సినిమాతో ఫాంలోకి వచ్చిన రామ్.. మరోసారి మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు. రామ్ ఎనర్జిలెవల్స్కు పర్ఫెక్ట్గా...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ హైపర్. నేను శైలజ సినిమాతో ఫాంలోకి వచ్చిన రామ్.. మరోసారి మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు. రామ్ ఎనర్జిలెవల్స్కు పర్ఫెక్ట్గా సరిపోయే కథను రెడీ చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో రూపొందిన కందిరీగ మంచి విజయం సాధించటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న హైపర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. స్టైలిష్గా కనిపిస్తున్న రామ్ లుక్స్ యూత్కు బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్న హైపర్కు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement