సూపర్ ఫాస్ట్ గా 'హైపర్' | Ram 'Hyper' to be release on 30th September | Sakshi
Sakshi News home page

సూపర్ ఫాస్ట్ గా 'హైపర్'

Aug 25 2016 7:47 PM | Updated on Sep 4 2017 10:52 AM

సూపర్ ఫాస్ట్ గా 'హైపర్'

సూపర్ ఫాస్ట్ గా 'హైపర్'

'నేను శైలజ' సినిమాతో సంవత్సరం ప్రారంభంలో సూపర్ హిట్ కొట్టిన రామ్ కొంత గ్యాప్ తరువాత.. తాజాగా 'హైపర్' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

'నేను శైలజ' సినిమాతో సంవత్సరం ప్రారంభంలో సూపర్ హిట్ కొట్టిన రామ్ కొంత గ్యాప్ తరువాత.. తాజాగా 'హైపర్' అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హైపర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. కొన్ని రోజులుగా వైజాగ్లో భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ షురూ చేసింది. సెప్టెంబరు 30 వ తేదీన 'హైపర్'ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా సీజన్లో 'హైపర్' సందడి చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement