టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్ | Fan intresting message to Hero Ram | Sakshi
Sakshi News home page

టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్

Feb 21 2017 3:46 PM | Updated on Sep 5 2017 4:16 AM

టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్

టెన్షన్ పెట్టకు తమ్ముడు : హీరో రామ్

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించిన యంగ్ హీరో రామ్, తన నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాతో పాటు ప్రైవేట్ పార్టీస్ లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న రామ్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఓ అభిమాని రామ్.., నెక్ట్స్ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నానంటూ రామ్ కు ట్విట్టర్ లో మెసేజ్ చేశాడు.

' రామ్ అన్నయ్య, ఈ రోజు నుంచి మీ నెక్ట్స్ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఉపవాసం చేస్తున్నాను. ఇది మొదటి రోజు లవ్ యు' అంటూ తరుణ్  సాయి ప్రకాష్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన రామ్, ' ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు తమ్ముడు, నేను అదే పనిలో ఉన్నా' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు రామ్.

 

Advertisement
 
Advertisement
Advertisement