ప్రతి ఇంట్లో..! | Ram Pothineni Hyper Movie Release Date Confirmed | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంట్లో..!

Aug 15 2016 11:05 PM | Updated on Sep 4 2017 9:24 AM

ప్రతి ఇంట్లో..!

ప్రతి ఇంట్లో..!

రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న సినిమా ‘హైపర్’

రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న సినిమా ‘హైపర్’. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు.. అనేది ఉపశీర్షిక. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ విశాఖలో శరవేగంగా జరుగుతోంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.
 
  యాక్షన్‌తో పాటు లవ్, కామెడీ అంశాలు ఉంటాయి. వచ్చే నెల 9కి చిత్రీకరణ పూర్తవుతుంది. సెప్టెంబర్ రెండో వారంలో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సత్యరాజ్, రావు రమేశ్, మురళీశర్మ, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: గౌతమ్ రాజు, కెమేరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: వెంకట్ బోయినపల్లి, సంగీతం: జిబ్రాన్.
 

Advertisement
 
Advertisement
Advertisement