శ్రీరామ్‌ పరాశర@24 క్రాఫ్ట్స్‌ | Cinema with the help of artificial intelligence | Sakshi
Sakshi News home page

శ్రీరామ్‌ పరాశర@24 క్రాఫ్ట్స్‌

Apr 25 2026 4:41 AM | Updated on Apr 25 2026 4:42 AM

Cinema with the help of artificial intelligence

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో సినిమా 

‘ఎపిక్‌ రామాయణ’ పేరుతో టీజర్‌ విడుదల 

నటులు, సాంకేతిక అంతా ఏఐ సృష్టి 

లక్షలాది వ్యూస్‌ 

టాలీవుడ్‌లో యువ దర్శకుడి సరికొత్త ప్రయోగం 

సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే సెట్టింగ్స్‌..అద్భుతమనిపించే విజువల్స్‌.. ఇవి ఏ పాన్‌ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్‌.!!  ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్‌లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు యవదర్శకుడు రామ్‌ పరాశర. రామాయణం పేరుతో ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం టీజర్‌ను ఎపిక్‌ రామాయణ పేరుతో ఇటీవల విడుదల చేశారు.  ఐదు రోజుల్లోనే లక్షల వ్యూస్‌ సాధించి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.  

అన్నీ తానై.. 
టీజర్‌లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు, యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు రామ్‌. టీజర్‌లో రెండో వ్యక్తి అనే మాటే లేదు. 

డైరెక్షన్‌ నుంచి ఎడిటింగ్‌ వరకూ, సౌండ్‌ డిజైన్‌ నుంచి విజువల్‌ ఎఫెక్ట్స్  వరకూ 3డీ నుంచి యానిమేషన్‌ వరకు మొత్తం 24 విభాగాలను ఒక్కడే నిర్వహించి రికార్డు సృష్టించాడు. టీజర్‌ ప్రారంభంలో శివుడి ధనస్సు గురించి వినిపించే పవర్‌ఫుల్‌ వాయిస్‌ ఓవర్, ప్రేక్షకుడిని వెంటనే పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే డీటైల్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పాన్‌–ఇండియా సినిమా స్థాయిని తలపిస్తున్నాయి. 

అవకాశం సృష్టించుకున్నా.. 
‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మా స్వగ్రామం. గుంటూరులో పెరిగాను. ప్రముఖ సంస్థలో ఐదేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాను. సినిమా మీద ఆసక్తితో ఆరేళ్లకిందట హైదరాబాద్‌ వచ్చి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఓ పెద్ద బ్యానర్‌లో దర్శకుడిగా అవకాశం వచ్చి కొన్ని రోజుల పాటు షూటింగ్‌ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. 

అయినా ఫలితం లేకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయంగా తీసుకున్నాను. ఆర్టిఫిషియెల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో అద్భుత రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తున్నాను.  ఏఐ టూల్స్‌ వాడి కేవలం మూడు రోజుల్లో రూపొందించిన టీజర్‌కు భారీ స్పందన వస్తోంది.’’     –శ్రీ రామ్‌ పరాశర బొమ్మకంటి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement