రామ్‌ రికార్డ్‌.. 3 రోజుల్లో 3.3 కోట్ల వ్యూస్‌ | Ram Hindi Dubbing Movie Creates New Record | Sakshi
Sakshi News home page

Feb 6 2019 3:33 PM | Updated on Feb 6 2019 3:42 PM

Ram Hindi Dubbing Movie Creates New Record - Sakshi

రామ్ క‌థానాయ‌కుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్షన్ ‘నెం.1 దిల్ వాలా’ యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గతంలో హిందీలో విడుద‌లైన ఏ తెలుగు సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ సాధించలేదు. ఇటీవల తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్‌లు బాలీవుడ్లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి.

కిశోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన ‘ఉన్నది ఒక‌టే జింద‌గీ’ స్నేహం విలువ‌ను చెప్పే అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి.. వదులుకున్న అబ్బాయి క‌థ‌. స్నేహితులుగా రామ్‌, శ్రీ విష్ణు న‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌ద‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్లరి మాట‌లు న‌వ్వులు పంచాయి. స్రవంతి సినిమాటిక్స్ ప‌తాకంపై స్రవంతి ర‌వికిశోర్, కృష్ణ చైత‌న్య సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్, లావణ్య త్రిపాఠి నాయికలుగా న‌టించారు.

ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే ఈ సినిమా 33 మిలియ‌న్ల (3 కోట్ల 30 లక్షల) వ్యూస్ సాధించ‌డం ప‌ట్ల హిందీ అనువాద హ‌క్కులు తీసుకున్న  గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మ‌నీష్ షా ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement