లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రైలర్‌: వాడిని నమ్మడమే నేను చేసిన ఏకైక తప్పు | Ram Gopal Varma Laxmis NTR Movie Trailer Released | Sakshi
Sakshi News home page

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ట్రైలర్‌: వాడిని నమ్మడమే నేను చేసిన ఏకైక తప్పు

Feb 14 2019 9:47 AM | Updated on Feb 14 2019 10:01 AM

Ram Gopal Varma Laxmis NTR Movie Trailer Released - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ గురువారం రిలీజ్‌ అయింది.  నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లో స్పష్టంగా చూపించాడు వర్మ. ఇక ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన నిమిషాల్లోనే దాదాపు లక్ష వ్యూస్‌ రావడం విశేషం. (‘ఎందుకు.. ఎందుకు.. లక్ష్మీ పార్వతి ఎందుకు..’)

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీవీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు.  సినిమా ట్రైలర్‌ రిలీజ్‌కు ఒక రోజు ముందు ‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. రేపు మీ ముందుకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు’అంటూ వర్మ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.  ('లక్ష్మీస్ ఎన్టీఆర్' వెన్నుపోటు పాట రిలీజ్‌)

Advertisement
 
Advertisement
Advertisement