Lakshmi's NTR Trailer 2 | ‘నా కొడుకు లోకేష్‌ మీద ఒట్టేసి చెపుతున్నా’ | RGV | Sr NTR - Sakshi
Sakshi News home page

‘నా కొడుకు లోకేష్‌ మీద ఒట్టేసి చెపుతున్నా’

Mar 8 2019 9:42 AM | Updated on Mar 8 2019 4:31 PM

Ram Gopal Varma Lakshmis Ntr Second Trailer - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. తొలి ట్రైలర్‌లో ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలను చూపించిన వర్మ తాజా ట్రైలర్‌లో లక్ష్మీ పార్వతి ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల మీద దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్‌కు దగ్గరైన తరువాత లక్ష్మీ పార్వతిని.. ఎన్టీఆర్‌ కుటుంబం సభ్యులు ఎలా అవమానించారు, ఆమె మీద ఎలాంటి విష ప్రచారం చేశారు అన్న విషయాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘వాడూ నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభించిన వర్మ తరువాత ఎన్టీఆర్ వెన్నుపోటు కారణమైన పరిణామాలను చూపించాడు.

లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్‌ నుంచి దూరం చేయడానికి ఎలాంటి కుట్రలు జరిగాయన్న విషయాలను ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌, సాంగ్స్‌ సంచలనాలు నమోదు చేయటంలో రెండో ట్రైలర్‌ కూడా యూట్యూబ్‌ లో రికార్డు సృష్టింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. తన సోషల్‌ మీడియా పేజ్‌లో ట్రైలర్‌ రిలీజ్ చేసిన వర్మ ‘ఇది స్వర్గం నుంచి ఎన్టీఆర్ విసిరిన లక్ష్మీ ఆటం బాంబ్’ అంటూ ట్వీట్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement