చెర్రీ ఆల్‌టైం రికార్డ్‌

Ram Charan VVR Teaser Create New Record - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా వినయ విధేయ రామ. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ శుక్రవారం రిలీజ్‌ అయ్యింది. బోయపాటి మార్క్ మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో రూపొందించిన ఈ టీజర్‌ మెగా పవర్‌ స్టార్ అభిమానులను అలరిస్తోంది.

అంతేకాదు ఈ టీజర్‌ కేవలం 24 గంటల్లో 15.1 మిలియన్ల( కోటీ 50 లక్షలకు పైగా) డిజిటిల్ వ్యూస్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది. కేవల  ధృవ, రంగస్థలం సినిమాలతో ప్రయోగాలు చేసిన చరణ్‌ ఈ సారి పక్కా కమర్షియల్ సినిమాతో అలరించనున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top