చెర్రీ డాన్సులు అదరహో! | Ram Charan - Sreenu Vaitla Movie Release on October 15 | Sakshi
Sakshi News home page

చెర్రీ డాన్సులు అదరహో!

Jun 29 2015 11:06 PM | Updated on Sep 3 2017 4:35 AM

చెర్రీ డాన్సులు అదరహో!

చెర్రీ డాన్సులు అదరహో!

ఐదే ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసేయాలన్నది డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రబృందం టార్గెట్. ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేసేయాలని ఫిక్సయ్యారు.

ఐదే ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసేయాలన్నది డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రబృందం టార్గెట్. ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేసేయాలని ఫిక్సయ్యారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్టోబర్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో రామ్‌చరణ్ లుక్ చాలా వెరైటీగా ఉంటుందని టాక్. ఇక, చరణ్ డ్యాన్సుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన స్టెప్పులేశారు. ఈ చిత్రంలో చరణ్ డ్యాన్సులు అదరహో అనే స్థాయిలో ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.. సో.. అభిమానులకు పండగే పండగ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి.
 

Advertisement
 
Advertisement
Advertisement