కాజల్ నువ్వు ఏమనుకోనంటే... | Ram Charan praises Kajal Aggarwal | Sakshi
Sakshi News home page

కాజల్ నువ్వు ఏమనుకోనంటే...

Aug 7 2014 9:35 PM | Updated on Sep 2 2017 11:32 AM

కాజల్ నువ్వు ఏమనుకోనంటే...

కాజల్ నువ్వు ఏమనుకోనంటే...

'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో కాజల్ బాగా చేసిందని హీరో రామ్చరణ్ కితాబిచ్చారు. ఆమె కెరీర్ లో ఇదే బెస్ట్ అని కూడా అన్నారు.

హైదరాబాద్: 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో కాజల్ బాగా చేసిందని హీరో రామ్చరణ్ కితాబిచ్చారు. ఆమె కెరీర్ లో ఇదే బెస్ట్ అని కూడా అన్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో టీజర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ... 'కాజల్ నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను. ఈ సినిమాలోనే నువ్వు బెస్ట్ గా చేశావు' అంటూ పొడిగారు. ఈ సినిమా కోసం కాజల్ చాలా కష్టపడిందని తెలిపారు. షూటింగ్ కంటే జిమ్ లోనే ఎక్కువసేపు గడిపిందని వెల్లడించారు.

ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించిన కమలీ ముఖర్జీపై కూడా చరణ్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్, గోదావరి సినిమాలు చూసి కమలీ ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా అందరికీ నచ్చుతుందని చరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణవంశీతో సినిమా చేయాలని నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తాను ఈ సినిమా చేయకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ తనకు దూరమయ్యేవారని చరణ్ అన్నారు.

'గోవిందుడు అందరి వాడేలే' అందరికీ నచ్చే మంచి సినిమా అవుతుందని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్రాజ్, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరావు, గణేష్, కాజల్, కమిలీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement