తమన్ ఔట్! యువన్ ఇన్!!

తమన్ ఔట్! యువన్ ఇన్!!

టాలీవుడ్ బిజీ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు మ్యూజికల్ హిట్లున్నాయి. ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’, ఎన్టీఆర్ ‘రభస’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్. కృష్ణవంశీ-రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికి కూడా తమన్ సంగీత దర్శకుడని గతంలో వార్తలొచ్చాయి. సంగీతాభిరుచి కలిగిన కృష్ణవంశీతో తమన్ చేసే ఈ చిత్రం కచ్చితంగా సంగీత సంచలనం అవుతుందని అందరూ భావించారు. అయితే... ఆ సినిమాకు ఇప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకునిగా తీసుకున్నట్లు తెలిసింది. యువన్ తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’, ‘దూసుకెళ్తా’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. కృష్ణవంశీ, యువన్, చరణ్... ఈ నవ్యమైన కలయిక  మెగా అభిమానులకు ఓ కొత్త అనుభూతినివ్వడం ఖాయం.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top