మెగాస్టార్‌ టైటిల్‌తో చరణ్‌..! | Ram Charan Boyapati Srinu Movie Title State Rowdy | Sakshi
Sakshi News home page

Sep 25 2018 3:38 PM | Updated on Sep 25 2018 3:38 PM

Ram Charan Boyapati Srinu Movie Title State Rowdy - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్‌ లో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న వివేక్‌ ఒబెరాయ్‌ తన షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియా వచ్చేశారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టేట్‌ రౌడీ అనే టైటిల్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. చిరంజీవి హీరోగా 1989లో రిలీజ్‌ సినిమా స్టేట్‌ రౌడీ.

ఇప్పుడు అదే టైటిల్‌ను చరణ్ సినిమాకు ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రకటన చేయకపోయినా సోషల్‌ మీడియాలో చరణ్ స్టేట్‌ రౌడీ సినిమా పోస్టర్‌ అంటూ ఫ్యాన్‌ మేడ్ పోస్టర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement