రానా ప్రోగ్రాంలో చెర్రీ, కియారా సందడి! | Ram Charan And Kiara Advani In Rana No 1 Yaari Programme | Sakshi
Sakshi News home page

Jan 5 2019 10:02 AM | Updated on Jan 5 2019 10:03 AM

Ram Charan And Kiara Advani In Rana No 1 Yaari Programme - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ చిత్రం వినయ విధేయ రామ. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా.. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్‌.

దీనిలో భాగంగానే రానా హోస్ట్‌ చేస్తోన్న నెం.1 యారీ సీజన్‌2లో రామ్‌ చరణ్‌, కియారా అద్వాణీ పాల్గొన్నారు. మొదటి సీజన్‌ విజయవంతం కావడంతో.. రెండో సీజన్‌ను విజయ్‌ దేవరకొండతో ఫుల్‌ జోష్‌లో ప్రారంభించాడు రానా. ఇక ఈ మధ్యే బాలయ్య, క్రిష్‌లు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇప్పుడిక చెర్రీ, కియారాల వంతు వచ్చింది. దీనిపై రానా ట్విటర్‌లో స్పందిస్తూ..‘ఈ ఏడాదిలో ఫస్ట్‌ టైమ్‌ చేసిన షూట్‌, ఈ సీజన్‌కు చేసిన లాస్ట్‌ షూట్‌ రెండూ నా నెం.1 యారీతోనే.. చూస్తూ ఉండండి’ అంటూ రామ్‌ చరణ్‌ గురించి చెప్పాడు. జనవరి 11న ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement