‘రాక్షసుడు’ని భయపెడుతున్నారు!

Ram and Puri Ismart Shankar Locking Horns With Rakshasudu - Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌. పూరి, రామ్‌ల కెరీర్‌కు కీలకం కావటంతో ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. అందుకే సినిమాను వారం పాటు వాయిదా వేసి మరి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాను ముందుగా జూలై 12న రిలీజ్ చేయాలని భావించినా తాజాగా జూలై 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న రీమేక్‌ సినిమా రాక్షసుడుకి కష్టాలు తప్పేలా లేవు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రమేష్‌ వర్మ రూపొందిస్తున్న సినిమా రాక్షసుడు. తమిళ సూపర్‌ హిట్‌ రాక్షసన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పెద్దగా బజ్‌ క్రియేట్ అవ్వటం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి మాస్‌ సినిమా పోటి వస్తే రాక్షసుడుకు ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. రీమేక్‌ సినిమా కావటంతో పాటు చాలా సన్నివేశాలు ఒరిజినల్‌లోవే వాడటంతో రాక్షసుడుపై పెద్దగా అంచనాలు లేవు. దీనికి తోడు బెల్లంకొండ చివరి సినిమా ‘సీత’కు దారుణమైన రిజల్ట్ రావటం కూడా సినిమా మీద హైప్‌ రాకపోవటానికి కారణమన్న టాక్‌ వినిపిస్తోంది. అందుకే ఫస్ట్‌ నుంచి ఈ సినిమా సోలో రిలీజ్ ఉండేలా జాగ్రత్త పడ్డారు చిత్రయూనిట్‌, ఇప్పుడు సడన్‌గా ఇస్మార్ట్‌ శంకర్‌ పోటి రావటంలో రాక్షసుడు టీం ఆలోచనలో పడ్డారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top