మహేష్కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది | Rakul Preet Singh to team up with Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

Jul 14 2016 1:19 PM | Updated on Jul 23 2019 11:50 AM

మహేష్కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది - Sakshi

మహేష్కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ మార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను...

సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ మార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు చాలా మంది బాలీవుడ్ భామలను సంప్రదించారు. ఒక దశలో పరిణితి చోప్రా ఫైనల్ అయ్యిందన్న వార్త కూడా వినిపించింది. అయితే ఈ బ్యూటి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో మురుగదాస్ టీం వెనక్కు తగ్గారు.

ఫైనల్గా టాలీవుడ్ నయా సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మురుగదాస్ అఫీషియల్గా కన్ఫామ్ చేశారు. ఇంతటి భారీ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు రకుల్ దర్శకుడు మురుగదాస్, హీరో మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపింది.

 

Advertisement
 
Advertisement
Advertisement