మహేష్ మూవీ షూటింగ్లో గాయపడ్డ రకుల్ | Rakul Preet Singh says No Fracture just sprain | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీ షూటింగ్లో గాయపడ్డ రకుల్

Oct 22 2016 11:27 AM | Updated on Sep 4 2017 6:00 PM

మహేష్ మూవీ షూటింగ్లో గాయపడ్డ రకుల్

మహేష్ మూవీ షూటింగ్లో గాయపడ్డ రకుల్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో పాల్గొన్న రకుల్ స్వల్పంగా గాయపడింది.  రకుల్ వేలు ఫ్యాక్చర్ అయినట్టుగా వార్తలు రావటంతో ఆమె సన్నిహితులు అభిమానుల ఆందోళన చెందారు.

ఈ విషయం పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్, తన ట్విట్టర్ పేజ్ లో 'నా వేలు ఫ్యాక్చర్ కాలేదు. కేవలం బెణికింది. త్వరలోనే సెట్ అవుతుంది.  ఈ విషయం స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్, మురుగదాస్ ల సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. 2017 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement