అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్‌ | Rakul Preet Singh Going To Delhi In PPE Gear | Sakshi
Sakshi News home page

పీపీఈ కిట్‌ ధరించి ఢిల్లీకి పయనమైన రకుల్!

Jun 11 2020 9:12 PM | Updated on Jun 11 2020 9:29 PM

Rakul Preet Singh Going To Delhi In PPE Gear - Sakshi

‘‘అటాక్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభమవుతోంది. ఆయనే మా డైరెక్టర్‌. మేమంతా భౌతిక దూరం పాటిస్తున్నాం. నాకెందుకో అంతరిక్షానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’అంటూ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమిత తాను ఈరోజు షూటింగ్‌ కోసం విమానంలో ఢిల్లీ వెళ్తున్నట్లు వెల్లడించారు. మిషన్‌ఢిల్లీ హ్యాష్‌ట్యాగ్‌తో పీపీఈ కిట్‌ ధరించి ఎయిర్‌పోర్టుకు వెళ్లిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

కాగా లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అటాక్’‌ సినిమాలో జాన్‌ అబ్రహం, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి రకుల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. ఈ సినిమాతో పాటు అర్జున్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కతున్న ఫ్యామిలీ డ్రామాలో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ఇక లాక్‌డౌన్‌లో కుటుంబంతో సరదాగా గడిపిన రకుల్‌.. వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు మరింత చేరవయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement