లవ్‌ ఫెయిల్యూర్స్‌ తట్టుకోలేవ్‌! | Rakul Preet as Avantika in Manmadhudu 2 | Sakshi
Sakshi News home page

లవ్‌ ఫెయిల్యూర్స్‌ తట్టుకోలేవ్‌!

Jul 10 2019 12:24 AM | Updated on Jul 23 2019 11:50 AM

Rakul Preet as Avantika in Manmadhudu 2 - Sakshi

నాగార్జున, రకుల్‌ప్రీత్‌ సింగ్‌

అవంతిక... పేరు చాలా సంప్రదాయబద్ధ్దంగా ఉన్నప్పటికీ అమ్మాయి మాత్రం వేరేలా అన్నమాట. మొహమాటం లేకుండా సిగరెట్‌ కాల్చేస్తుంది. అలాంటి అవంతిక పద్ధతి గల అమ్మాయిలా కలరింగ్‌ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అవంతిక అసలు రంగును మన్మథుడు ఇట్టే పసిగడతాడు? ఎలా? అనే అంశాలను వెండితెరపై చూసి తెలుసుకోవాలి. నాగార్జున, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరో హీరోయిన్లుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

ఇటీవల ఈ సినిమాలోని నాగార్జున క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా రకుల్‌ప్రీత్‌ చేసిన అవంతిక పాత్రకు చెందిన టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో ‘ఇప్పటిదాకా యు – సర్టిఫికేట్‌ను ప్రయత్నించాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్‌ చూపిస్తా’, ‘ ఈ వయసులో నువ్వు లవ్‌ ఫెయిల్యూర్స్‌ తట్టుకోలేవ్‌’ అని రకుల్‌ పలికిన డైలాగ్స్‌ ఆడియన్స్‌కు కిక్‌ ఇస్తున్నాయ్‌. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement