హీరోయిన్ డ్రెస్పై మోదీ ఫొటోల కలకలం | Rakhi Sawant wears 'sexy' Narendra Modi dress | Sakshi
Sakshi News home page

హీరోయిన్ డ్రెస్పై మోదీ ఫొటోల కలకలం

Aug 10 2016 5:22 PM | Updated on Aug 21 2018 9:36 PM

హీరోయిన్ డ్రెస్పై మోదీ ఫొటోల కలకలం - Sakshi

హీరోయిన్ డ్రెస్పై మోదీ ఫొటోల కలకలం

బాలీవుడ్ నటి రాఖీ సావంత్, వివాదాలు వేరు కాదు. ఈ భామకు వివాదాలంటే చాలా ఇష్టం.

బాలీవుడ్ నటి రాఖీ సావంత్, వివాదాలు వేరు కాదు. ఈ భామకు వివాదాలంటే చాలా ఇష్టం. అందుకేనేమో సినిమాల్లో కంటే వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. అన్నట్టు రాఖీ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానట!

ఇలాంటి అభిమానులు ఉండాలని మోదీ కోరుకుంటారో లేదో కానీ.. రాఖీ మాత్రం మోదీపై తన అభిమానాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తుంటుంది. రాఖీ తన డ్రెస్ (స్కర్ట్) పై మోదీ ఫొటోలను డిజైన్ చేయించుకుంది. రాఖీ వేసుకున్న స్కర్ట్ మొత్తం మోదీ ఫొటోలే ఉన్నాయి. స్కర్ట్ ముందు, వెనుక భాగంలో రెండు పెద్ద ఫొటోలు ఉన్నాయి. రాఖీ ఈ డ్రెస్ వేసుకుని ఇటీవల అమెరికాలో ఓ పార్టీలో పాల్గొంది. రాఖీ ఈ డ్రెస్లో అర్ధనగ్నంగా కనిపిస్తూ, సెక్సీగా పొజులిస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. రాఖీ గతంలో కూడా మోదీని ఉద్దేశిస్తూ వింత వ్యాఖ్యలు చేసింది.

గతంలో సీలింగ్ ఫ్యాన్లను నిషేధించాలని ఈ అమ్మడు మోదీని కోరింది. చాలామంది కూతుళ్లు, కోడళ్లు ఇంట్లో ఫ్యాన్లకు ఉరేసుకుని చనిపోతున్నారని, ఆత్మహత్యలను నివారించడానికి సీలింగ్ ఫ్యాన్లు లేకుండా చేయాలని రాఖీ సానుభూతి ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీని చూసి నేర్చుకోవాలని ఇటీవల సలహా ఇచ్చింది. మహిళా సాధికారిత కోసం మోదీ ఎంతో కృషి చేస్తున్నారని రాఖీ ప్రశంసించింది. రాఖీ ప్రచారం కోసమే చౌకబారు చర్యలకు పాల్పడుతోందని మోదీ అభిమానులు విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement