పదివేల చెత్తబుట్టలు! | Rakhi Sawant distributes dustbins, says not a political stunt | Sakshi
Sakshi News home page

పదివేల చెత్తబుట్టలు!

Mar 10 2014 12:40 AM | Updated on Sep 2 2017 4:31 AM

పదివేల చెత్తబుట్టలు!

పదివేల చెత్తబుట్టలు!

కురచ దుస్తుల్లో కనిపించడానికి ఏమాత్రం మొహమాటపడని రాఖీ సావంత్, అడపా దడపా బోల్డ్ స్టేట్‌మెంట్స్ కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి వింత చర్యలు కూడా చేస్తుంటారు.

 కురచ దుస్తుల్లో కనిపించడానికి ఏమాత్రం మొహమాటపడని రాఖీ సావంత్, అడపా దడపా బోల్డ్ స్టేట్‌మెంట్స్ కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి వింత చర్యలు కూడా చేస్తుంటారు. కానీ, ఇటీవల మాత్రం ఓ వివేకవంతమైన పని చేశారు ఈ హాట్‌గాళ్. మురికివాడల్లో నివసించేవారికి మహిళా దినోత్సవం సందర్భంగా శుభ్రత-పరిశుభ్రత గురించి తెలియజేయాలనుకున్నారు. పదివేల చెత్తబుట్టలు, కొన్ని బహుమతులు, తినుబండారాలు కొనుక్కుని మురికివాడలకు వెళ్లారు రాఖీ. అక్కడున్నవారికి అవి పంచారు. డస్ట్‌బిన్స్ పంచుతున్నప్పుడు అందరూ అందులోనే చెత్త వేయాలని, తద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, దానివల్ల రోగాల బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ లెక్చర్ కూడా ఇచ్చారు రాఖీ. ఇన్నాళ్లు గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ఆమెకు రాజకీయాల్లో చేరాలని ఉందట. అందులో భాగంగానే ఇదంతా చేశారన్నది కొంతమంది ఊహ. ఏదేమైనా రాఖీ చేసింది మంచి పనే కాబట్టి కొంతమంది మెచ్చుకుంటున్నారు కూడా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement