థ్యాంక్స్ డియర్ కోడలా : నాగ్ | Raju Gari Gadhi 2motion Poster | Sakshi
Sakshi News home page

థ్యాంక్స్ డియర్ కోడలా : నాగ్

Aug 29 2017 1:20 PM | Updated on Jul 15 2019 9:21 PM

థ్యాంక్స్ డియర్ కోడలా : నాగ్ - Sakshi

థ్యాంక్స్ డియర్ కోడలా : నాగ్

కింగ్ నాగార్జున ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కింగ్ నాగార్జున ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

పోస్టర్ రిలీజ్ చేయటంతో పాటు తన మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది సమంత. 'ఆయన ఎప్పటికీ రాజే. ఎందుకంటే తనని తాను ఎలా పరిపాలించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతీ ఏడాది గడుస్తున్న కొద్ది మా మామ మరింత గొప్పగా పాలిస్తున్నారు' అంటూ ట్వీట్ చేసింది సమంత. సమంత ట్వీట్ పై స్పందించిన నాగ్ ' థ్యాంక్స్ డియర్ కోడలా.. నువ్వ్ బెస్ట్' అంటూ రిప్లై ఇచ్చాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement