కబాలీ మళ్లీ వాయిదా | Rajnikanth Kabali Movie Release Postponed | Sakshi
Sakshi News home page

కబాలీ మళ్లీ వాయిదా

Apr 12 2016 12:12 PM | Updated on Sep 3 2017 9:47 PM

కబాలీ మళ్లీ వాయిదా

కబాలీ మళ్లీ వాయిదా

వరుస డిజాస్టర్ల తరువాత సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. ఎక్కవుగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసే రజనీ చాలా కాలం తరువాత ఓ యువ దర్శకుడితో కలిసి...

వరుస డిజాస్టర్ల తరువాత సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబాలీ. ఎక్కువుగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసే రజనీ చాలా కాలం తరువాత ఓ యువ దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో కబాలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వయసైపోయిన మాజీ డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు రజనీ. తన వయసుకు తగ్గ పాత్రే అయినా స్టైల్, మేనరిజమ్స్లో మాత్రం తన మార్క్ చూపిస్తున్నాడు.
 
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ముందుగా సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే తమిళనాట ఎలక్షన్ల వేడి కారణంగా కబాలీ వాయిదా పడింది. మే నెలాఖరున కబాలీ రిలీజ్కు ప్లాన్ చేశారు. అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడిందన్న వార్త ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను కలవర పెడుతోంది. కారణాలేంటన్నది వెల్లడించకపోయినా కబాలీ సినిమాను జూన్ రెండో వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement