
రాజ్‌కుమార్ సంతోషి
ముంబై: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత రాజ్‌కుమార్ సంతోషి ఆస్పత్రిలో చేశారు. గుండె సంబంధింత సమస్యలతో నానావతి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కించిన సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఘాయల్(1990), అందాజ్ అప్నా అప్నా(1993), ఘాతక్(1996), పుకార్ (2000), ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), ఫటా పోస్టర్ నిక్లా హీరో(2013) సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పుకార్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమాలకు జాతీయ అవార్డులు దక్కాయి.