సూర్యకు నటన రాదనుకున్నా!

Rajinikanth released by bandobast audio launch - Sakshi

– రజనీకాంత్‌

‘‘తన సహనటులెవరికీ చెడ్డ పేరు రాకూడదనుకుంటారు శివకుమార్‌. వాళ్ల అబ్బాయిలు సూర్య, కార్తీని కూడా అలానే పెంచారు. తొలి సినిమా ‘పరుత్తివీరన్‌ (‘మల్లిగాడు’)లో కార్తీ అద్భుతంగా చేశాడు. సూర్య ఫస్ట్‌ సినిమా చూసి తనకు నటించడం రాదేమో? అనుకున్నాను. తనని తాను మలచుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు’’ అని రజనీకాంత్‌ అన్నారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాప్పాన్‌’ (తెలుగులో బందోబస్త్‌). సయేషా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య, సముద్రఖని కీలక పాత్రలు చేశారు.

ఈ చిత్రం ఆగస్ట్‌ 30న రిలీజ్‌ కానుంది. ఈరోజు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు కేవీ ఆనంద్‌ నా ‘శివాజీ’ సినిమాకు కెమెరామేన్‌. ఆయనకు కథ మీద మంచి జడ్జిమెంట్‌ ఉంది. నేను ఆయనతో ఓ సినిమా చేయాలి  కానీ ఆగిపోయింది. మోహన్‌లాల్‌ గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. హ్యారిస్‌ మ్యూజిక్‌ బావుంటుంది. ‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య నటన ఆశ్చర్యం కలిగించింది. తమిళ ఇండస్ట్రీకు దొరికిన వరం నిర్మాత సుభాస్కరన్‌.

ప్రస్తుతం ‘ఇండియన్‌ 2, దర్బార్, పొన్నియిన్‌ సెల్వన్‌’ నిర్మిస్తున్నారు. ‘శివపుత్రుడు, గజిని, సింగం, సింగం 2’ వంటి గొప్ప సినిమాలు చేశారు సూర్య. విద్యా వ్యవస్థపై సూర్య చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ‘అగరం’ సంస్థ ద్వారా ఎందర్నో విద్యావంతుల్ని చేస్తున్నారు సూర్య’’ అన్నారు. ‘‘కేవీ ఆనంద్‌గారు, నేను చేస్తున్న మూడో (వీడొక్కడే, బ్రదర్స్‌) సినిమా ఇది. అందర్నీ మెప్పించేలా ఈ సినిమా తీశారాయన. సుభాçస్కరన్‌గారికి థ్యాంక్స్‌. ఆర్య ముందే సాయేషాతో ప్రేమగా నటించే సీన్స్‌ చేయడానికి ఇబ్బందిపడ్డాను (నవ్వుతూ).

రజనీకాంత్‌గారికి, శంకర్‌గారికి థ్యాంక్స్‌. ఒకరి దారి రహదారి.. మరొకరేమో తన సినిమాలతో ఇండస్ట్రీను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. నా బలం  ఫ్యాన్సే. కుటుంబం తర్వాతే సమాజం గురించి ఆలోచించండి (అభిమానులను ఉద్దేశిస్తూ..)’’ అన్నారు సూర్య. ‘‘ఈ కాప్పాన్‌కు (రక్షించేవాడు) పైనున్న కాప్పాన్‌ అండగా నిలుస్తాడనుకుంటున్నాను’’ అన్నారు మోహన్‌లాల్‌. ‘‘సూర్య రానురాను యువకుడిలా మారిపోతున్నాడు. కమర్షియల్‌ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి’’ అన్నారు శంకర్‌.

‘‘ఈ సినిమాలో మోహన్‌లాల్‌ ప్రధానమంత్రి పాత్ర చేశారు. సూర్యకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. సీన్‌ అద్భుతంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు సూర్య’’ అన్నారు ఆనంద్‌. ‘‘సమాజం మీద బాధ్యత ఉన్న కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. నటుడిగా ఆల్రెడీ నిరూపించుకున్నారు’’ అన్నారు రచయిత వైరముత్తు. ‘‘6వ తరగతిలో పెయింటింగ్‌ పోటీలో నా చేతుల మీదగా ఆవార్డ్‌ తీసుకున్నారు ఆనంద్‌. సూర్యకు, తనకు ఈ సినిమా హ్యాట్రిక్‌ అవుతుంది’’ అన్నారు శివకుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top