‘కాలా’ కలెక్షన్లు.. అట్టర్‌ ఫ్లాప్‌ | Rajinikanth Kaala Disaster In Telugu | Sakshi
Sakshi News home page

Jun 12 2018 12:38 PM | Updated on Jun 12 2018 4:32 PM

Rajinikanth Kaala Disaster In Telugu  - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ స్టార్‌ అభిమానులకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. రజనీ ఇమేజ్‌ తగ్గ కథా కథనాలు కాకపోవటంతో కాలాపై అభిమానులు కూడా పెదవి విరిచారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాలా, ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఈ సినిమా.. రజనీ ఖాతాలో మరో భారీ డిజాస్టర్‌ అంటున్నారు విశ్లేషకులు.

తమిళనాట కాస్త పరవాలేదనిపించినా తెలుగు, హిందీ భాషల్లో కాలా వసూళ్లు భారీ నష్టాలు మిగిల‍్చేలా ఉన్నాయి. కాలా తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ 30 కోట్లకు పైగా ధర పలికినట్టుగా వార్తలు వినిపించాయి. అంటే ఈ సినిమా తెలుగులో విజయం సాధించాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి 30 కోట్లకు పైగా వసూళ్లు సాదించాలి. కానీ తొలి ఐదు రోజుల్లో కాలా కేవలం 7 కోట్లు మాత్రమే వసూళు చేసింది. సోమవారం తరువాత కలెక్షన్లు మరింతగా పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో కాలాకు భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేకులు.

Advertisement
 
Advertisement
Advertisement