రజనీ చికిత్స పొందుతున్నారా? | Rajinikanth Getting Treatment in American | Sakshi
Sakshi News home page

రజనీ చికిత్స పొందుతున్నారా?

Jun 10 2016 1:36 AM | Updated on Apr 4 2019 3:19 PM

రజనీ చికిత్స పొందుతున్నారా? - Sakshi

రజనీ చికిత్స పొందుతున్నారా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారా? అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారా? అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారా? అందువల్లే ఈ నెల 12న బ్రహ్మాండంగా నిర్వహించాల్సిన కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడిందా? ఇలాంటి వార్తలే ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
 రజనీకాంత్ నటించిన భారీ చిత్రం కబాలి నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపలి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌లో చరిత్రను తిరగరాసిన కబాలి వ్యాపారపరంగా రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక చిత్రం విడుదలైతే ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందోనన్న ఆసక్తి పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తిలోనూ కలుగుతోందనడం అతిశయోక్తి కాదు.
 
  కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాల్ని నభూతోనభవిష్యత్తుగా నిర్వహించనున్నట్లు ప్రచారం హోరెత్తింది. అలాంటిది ఇప్పుడు చాలా సింపుల్‌గా ఆన్‌లైన్ విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రజనీకాంత్ గురించి రకరకాల ప్రచారం హల్‌చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో విహార యాత్రలో ఉన్నారు.
 
 పనిలో పనిగా ఆయన నటిస్తున్న మరో బ్రహ్మాండ చిత్రం 2.ఓ చిత్ర కోసం గెటప్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ అనారోగ్యం కారణంగా అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారని, అందువల్లే కబాలి ఆడియో సింపుల్‌గా ఆన్‌లైన్‌తో విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా అసత్య ప్రచారం అనిరజనీకాంత్ ఎలాంటి ఆనారోగ్యానికి గురి కాలేదని,ఆయన లక్షణంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.     

Advertisement
 
Advertisement
Advertisement