కొబ్బరికాయ కొట్టారు

rajinikanth with director shiva new movie launch - Sakshi

కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్‌. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించనున్నారు. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమా ముహూర్తం బుధవారం జరిగింది. 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌ సినిమాలో ఖుష్బూ నటించనుండటం విశేషం. అలాగే ఖుష్భూ తమిళ సినిమాలో కనిపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ నెల రెండోవారంలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top