సూపర్‌ స్టార్‌ ‘దర్బార్‌’ | Rajinikanth Ar Murugadoss Darbar Movie First Look | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్‌ ‘దర్బార్‌’

Apr 9 2019 9:49 AM | Updated on Apr 9 2019 9:49 AM

Rajinikanth Ar Murugadoss Darbar Movie First Look - Sakshi

సౌత్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పేటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దర్బార్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. టైటిల్‌ లోగోతో పాటు సినిమాలో రజనీ లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్‌. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్వరాలందించనున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement