మాకు పది లక్షల విరాళం

Rajasekhar donates 10 lakhs to MAA - Sakshi

సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ అధ్యక్షతన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచిపోయింది. ఎన్నికల సందర్భంగా ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనం తీసి ఖర్చు చేయడం సమంజసం కాదని భావించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌  అసోసియేషన్‌కు పది లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ‘‘ఇంతవరకూ ‘మా’ అసోసియేషన్‌ అదనపు నిధుల కోసం సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోంది. ఈసారి కూడా అదే తరహాలో నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాజశేఖర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top