hero rajasekhar
-
హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం
-
హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం
Hero Rajasekhar Father Is No More: టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్నై డీఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ రెండో సంతానమే హీరో రాజశేఖర్. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. Varadarajan Gopal (93) Garu (father of actor @ActorRajasekhar) is no more. Condolences to the family members. RIP @ShivathmikaR @Rshivani_1 pic.twitter.com/uep5nRrpp7 — BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021 -
సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న టీఎస్07 ఎఫ్‌జడ్1234 నంబర్ గల బెంజ్ కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. అయితే వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజశేఖర్ మంగళవారం రాత్రి ఫిలింసిటీ నుంచి హైదరాబాద్‌కు తన బెంజ్ కారులో డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరారు. అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి సుమారు 38 కి.మీ. దూరం ప్రయాణం చేసిన తర్వాత శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ శివారులోకి రాగానే సుమారు 1.15 గంటల ప్రాంతంలో కారు అదుపు తప్పింది. కుడి వైపున ఉన్న డివైడర్‌పై చెట్లను ఢీకొంటూ సుమారు 70 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి రోడ్డు అవతలి వైపున బోల్తా పడింది. కారు రోడ్డు అవతలి వైపు బోల్తా పడిన సమయంలో అటుగా వేరే వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడిన రాజశేఖర్ అటుగా వస్తున్న వేరే కారులో గచ్చిబౌలి వైపు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సమాచారం అందడంతో అప్పటికప్పుడే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ రాజశేఖర్ లేకపోవడంతో కారును స్టేషన్‌కు తరలించారు. అతివేగమే కారణం... హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి ర్యాష్ డ్రైవింగే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఔటర్‌పైకి ఎక్కిన అరగంటలోపే ప్రమాదానికి గురి కావడాన్ని బట్టి కారు వేగం గంటకు 120 కి.మీ. నుంచి 140 కి.మీ. మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కారు టైరు కూడా పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారుల నివేదిక ఆధారంగా ఈ విషయంపై నిర్ధారణకు రానున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఇక రాజశేఖర్ వాహనంపై ఓవర్‌స్పీడ్‌కు సంబంధించి 23 ట్రాఫిక్ చలాన్లున్నాయని చెప్పారు. -
మాకు పది లక్షల విరాళం
సీనియర్ నటుడు వీకే నరేష్ అధ్యక్షతన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచిపోయింది. ఎన్నికల సందర్భంగా ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనం తీసి ఖర్చు చేయడం సమంజసం కాదని భావించిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అసోసియేషన్‌కు పది లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ‘‘ఇంతవరకూ ‘మా’ అసోసియేషన్ అదనపు నిధుల కోసం సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోంది. ఈసారి కూడా అదే తరహాలో నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాజశేఖర్. -
ఎన్టీఆర్ బయోపిక్: మరో ఇంట్రెస్టింగ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : హీరో బాలకృష్ణ.. తన తండ్రి పాత్ర పోషిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ మధ్యే సినీరాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ నిజజీవితంలోని ముఖ్యపాత్రలను సినిమాలో ఎవరు పోషిస్తారనే విషయంపై ఇప్పటివరకు చిత్ర యునిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదివరకే కథలో కీలకమైన నాదెండ్ల భాస్కరరావు పాత్రకు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ జీవితంలో కీలకమైన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రాజశేఖర్ పోషించనున్నట్లు టాలీవుడ్ సమాచారం. హీరో రాజశేఖర్, బాలకృష్టలు ఇద్దరు మంచి సన్నిహితులు. గరుడవేగ సినిమా ప్రమోషన్లో పాల్గోన్న బాలకృష్ణను ఉద్దేశించి ఆయనతో కలిసి నటించాలనే కోరికను రాజశేఖర్ బయట పెట్టారు. దీంతో ఇద్దరం కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేద్దాం అని బాలకృష్ణ సమాధానం ఇవ్వడం అప్పట్లో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలకృష్ణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రాజశేఖర్‌కు ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జీవిత రాజశేఖర్‌లు పాల్గొనటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. -
నటుడు రాజశేఖర్ కారుకు ప్రమాదం..
-
తేజ అహం...రాజశేఖర్ విలన్!
‘యాంగ్రీ యంగ్‌మ్యాన్’ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు పూర్తిస్థాయి విలన్‌గా కనిపించను న్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. ‘నువ్వు-నేను’, ‘జయం’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన తేజ దర్శకత్వంలో త్వరలో ‘అహం’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో విలన్‌గా రాజశేఖర్ నటించనున్నారు. తేజ చెప్పిన స్క్రిప్ట్‌కు ఇంప్రెసైన రాజశేఖర్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో ఓ యంగ్ హీరో చేయనున్నారు. రాజశేఖర్‌కు జోడీగా ప్రముఖ కథానాయికను ఎంపిక చేయనున్నారు. ఇటీవలి కాలంలో హీరో జగపతిబాబు కూడా విలన్‌గా మారి, వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై తెలుగు సినీ సీమలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్ళలో ‘తలంబ్రాలు’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. ‘అహం’లో రాజశేఖర్ పాత్రను విభిన్నంగా ఆవిష్కరించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలియనుంది. -
సినిమా రివ్యూ - గడ్డం గ్యాంగ్
చిత్రం - గడ్డం గ్యాంగ్, తారాగణం - రాజశేఖర్, షీనా, అచ్చు, ‘సత్యం’ రాజేశ్, నాగబాబు, నరేశ్, సీత, నోయల్, పాటలు - రామజోగయ్యశాస్త్రి, బాలాదిత్య, సంగీతం - అచ్చు, సమర్పణ - జీవితా రాజశేఖర్, నిర్మాతలు - శివాని, శివాత్మిక, దర్శకత్వం -సంతోష్ పీటర్ జయకుమార్ .............................. కొన్ని సినిమాలకు కొన్ని విషయాలు కలిసొస్తుంటాయి. రిలీజ్ టైమ్ మొదలు ఆ కథకు లభించిన పాత్రధారులు, వాళ్ళకున్న (లేదా లేని) ఇమేజ్‌లు, ఆ సినిమా తీసిన భాషా సమాజంలోని పరిస్థితులు - ఇలా సవాలక్ష కారణాలు ఒక సినిమా విజయవంతం కావడానికి! కానీ, అవేవీ గుర్తించకుండా ఒక భాషలో హిట్టయిన కథ కదా అని మరోభాషకు యథాతథంగా దించేస్తే... అప్పుడు ఆ కథ, రీమేక్ సినిమా పరిస్థితి నీళ్ళలో నుంచి బయటపడ్డ చేపపిల్లే! తమిళంలో గత ఏడాది ఘనవిజయం సాధించిన ‘సూదుకవ్వం’ అనే చిన్న బడ్జెట్ ప్రయత్నాన్ని ఇప్పుడు తెలుగులో హీరో రాజశేఖర్ ‘గడ్డం గ్యాంగ్’గా అందించడం చూశాక, ఈ ఆలోచనలన్నీ మరోసారి మదిలో మెదిలితే తప్పు లేదు. కథేమిటంటే... హైదరాబాద్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ కమ్ రూమ్మేట్లు (‘సత్యం’ రాజేశ్, నటుడి అవతారం కూడా ఎత్తిన సంగీత దర్శకుడు అచ్చు). సొంత ఊళ్ళో సినీతార అనుష్కకు గుడి కట్టి, అందరితో తిట్లు తిని హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మిత్రుడు సురేశ్ (అచ్చు) దగ్గరకు వచ్చేస్తాడు మరో మిత్రుడు. ఉద్యోగాలు పోగొట్టుకున్న ఇద్దరు, ఈ మూడోవాడితో కలసి తిరుగుతున్న టైమ్‌లో అనుకోకుండా వాళ్ళకు ‘గడ్డం’ దాస్ (రాజశేఖర్) తారసపడతాడు. భౌతికంగా లేని మరదలు షాలూ (షీనా)ను పక్కనే ఉందని ఊహించుకుంటూ గడిపే దాస్ చిన్న చిన్న కిడ్నాప్‌లు చేసి, డబ్బులు వసూలు చేసుకోవడం ద్వారా గడిపేస్తుంటాడు. అలా అందరూ ఒక గ్యాంగ్‌గా తయారవుతారు. ఆ సమయంలో పారిశ్రామికవేత్త (కాదంబరి కిరణ్‌కుమార్) దగ్గర నుంచి వాళ్ళకు ఒక ఆఫర్ వస్తుంది. నిజాయతీపరుడైన ఆర్థిక మంత్రి ధర్మరాజు (నరేశ్) కుమారుడు సత్య హరిశ్చంద్ర (ర్యాప్ గాయకుడు నోయల్)ను కిడ్నాప్ చేస్తే 2 కోట్లిస్తామని! ఆ ప్లాన్‌కు ఒప్పుకొన్న గ్యాంగ్ మంత్రి దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేస్తుంది. తీరా ఆ డబ్బు అందుకున్నాక మంత్రి గారి కొడుకే డబ్బు మీద ఆశతో ఆ గ్యాంగ్‌ను మోసగించి, డబ్బుతో పారిపోతాడు. అక్కడకు చిత్ర ప్రథమార్ధం అయిపోతుంది. ఆ తరువాత గడ్డం గ్యాంగ్ ఎదుర్కొన్న సమస్యలేమిటి, ఈ కిడ్నాప్ కథలోని లోతులు తెలుసుకోవడానికి రాజకీయ - పోలీసు పెద్దలు ప్రత్యేకించి దింపిన గుంతకల్ ఎస్.ఐ. గబ్బర్ సింగ్ (తమిళ మాతృకలో చేసిన తమిళ నటుడే ఇందులోనూ చేశాడు) ఏం చేశాడు, అసలు గడ్డం దాస్ ఈ కిడ్నాప్‌లన్నీ దేని కోసం చేస్తున్నాడు లాంటి ప్రశ్నలన్నీ ద్వితీయార్ధం చివరి దాకా కూర్చుంటే తీరుతాయి. ఎలా చేశారంటే... హీరో రాజశేఖర్‌కు ఇది చాలా విభిన్నమైన పాత్ర. దానికి తగ్గట్లుగా ఆయన తన ఇమేజ్‌నూ, స్టైల్‌నూ మార్చుకొని మరీ సినిమా చేశారు. కానీ, అసలు స్క్రిప్టులోనే ఆ పాత్ర చిత్రణ, దాని స్వరూప స్వభావాలేవీ నిర్దుష్టంగా లేకపోవడంతో, ఇంత శ్రమపడినా ఆశించిన ఫలితం దక్కడం కష్టమే! అయినా ఆయన కష్టాన్ని గుర్తించక తప్పదు. మామూలు హీరో ఇమేజ్‌కు భిన్నంగా ఈ ప్రయత్నం చేసిన రాజశేఖర్ తన కెరీర్‌పై పునరాలోచించుకోవాలి. రాగల రోజుల్లో పూర్తిస్థాయి క్యారెక్టర్ యాక్టర్‌గా ఆయన మారితే, అటు ఇండస్ట్రీకీ, ఇటు ఎదిగొస్తున్న ఇద్దరమ్మాయిల (శివాని, శివాత్మిక) తండ్రిగా ఆయనకూ మరింత ఉపయోగం ఉంటుంది. షీనా చేసిన పాత్ర నిడివి చిన్నది. ఉన్నంతలో నరేశ్ ఫరవాలేదనిపిస్తారు. ఎస్.ఐ. గబ్బర్ సింగ్‌గా నటించిన తమిళ నటుడు మాతృకలో లాగానే, రీమేక్‌లోనూ నోరు విప్పకుండా, కనీసం ఒక్కటైనా డైలాగ్ లేకుండానే సీరియస్‌గా సాగే పాత్రను పండించారు. ముమైత్ ఖాన్ ఒక ఐటమ్ సాంగ్‌లో నర్తిస్తుంది. అచ్చు సంగీతం అక్కడక్కడి మెరుపులతో సరిపెడుతుంది. దర్శకుడి గురించి గట్టిగా చెప్పుకోవడానికీ ఏమీ లేదు. ఇంతకీ ఎలా ఉందంటే... ఫస్టాఫ్ చాలా నిదానంగా, పాత్రల పరిచయంతోనే అయిపోతుంది. చక్కటి మలుపుతో... ఇంటర్వెల్. సెకండాఫ్ కొంత ఆసక్తిగా, చకచకా నడుస్తుంది కానీ, చివరకు వచ్చేసరికి అదొక్క పాజిటివ్ సరిపోకపోవచ్చు. నిజం చెప్పాలంటే, ఈ సినిమా ఒక అతుకుల బొంత. ఏ సీనుకు ఆ సీను నడవడమే తప్ప, ఒక కథ, దానికి బలమైన పాత్రలు, వాటి మధ్య అంతస్సంఘర్షణ లాంటివేమైనా ఆశిస్తే తప్పు ప్రేక్షకులది. నరేశ్ తన బావమరిది అయిన డి.జి.పి. పాత్రధారి ‘వైజాగ్’ ప్రసాద్‌ను ఆదేశించే తీరుచూస్తే, కథలో నరేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రా, లేక హోమ్ మంత్రా అని సందేహం కలుగుతుంది. సినిమా సెకండాఫ్ అంతా మినిస్టర్ నుంచి గడ్డం గ్యాంగ్ వసూలు చేసిన రూ. 2 కోట్ల డబ్బు చుట్టూ ప్రధానంగా నడుస్తుంది. మరి, సదరు కిడ్నాప్ చేస్తే నమ్మినబంటు ఇస్తానన్న రెండు కోట్ల గురించి ఆ సీన్లో తప్ప, మళ్ళీ సినిమాలో ఎక్కడా రాదు. ఆ సీన్లో అలా చెప్పించామన్న సంగతి దర్శక, రచయితలు కూడా కన్వీనియంట్‌గా మర్చిపోయారు. అలాగే, ఇంతకీ హీరో గారి షాలూ ఉన్నట్లా, పోయినట్లా, ఎదురుగా లేని ఆమెను హీరో ఊహించుకుంటూ మాట్లాడడానికి కారణం ఏమిటి లాంటి అనేక సందేహాలు సినిమా చూస్తున్నప్పటి నుంచి సగటు ప్రేక్షకుణ్ణి వేధిస్తుంటాయి. కానీ, వాటన్నిటినీ సహిస్తూ, భరిస్తూ సినిమా పూర్తిగా చూసేయాల్సిందే! తీరా చూసినా, ఆ సందేహాలకు మరికొన్ని చేరేవే తప్ప, ఆరేవీ తీరేవీ కాదు. వీటన్నిటి ఫలితంగా సినిమా చూస్తుంటే, ప్రేక్షకులు కథతో, పాత్రలతో కలసి ప్రయాణించలేకపోతారు. ఈ ‘గడ్డం గ్యాంగ్’కు ఉన్న అతి పెద్ద నెగిటివ్ అదే! - రెంటాల జయదేవ