సినీ నటుడు రాజశేఖర్ కారు ఆదివారం అర్ధ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌పై ముందువెళ్తున్న రామిరెడ్డి అనే వ్యక్తి కారును రాజశేఖర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించి కారునడిపాడని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి చనిపోయిన డిప్రెషన్‌లో కారు నడపడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, బ్రీత్ అన్‌లైజర్ పరీక్షల్లో మద్యం సేవించలేదని తేలిందని స్థానిక ఎస్‌ఐ శేఖర్ రెడ్డి సాక్షికి తెలిపారు. చివరకు రామిరెడ్డి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు.