తేదీ మారిందా? | Rajamoulis RRR movie release date postponed | Sakshi
Sakshi News home page

తేదీ మారిందా?

Jan 19 2020 12:38 AM | Updated on Jan 19 2020 12:38 AM

Rajamoulis RRR movie release date postponed - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

‘‘నా సినిమా బావుంటుంది అని గ్యారెంటీగా చెప్పగలను కానీ ఎప్పుడు విడుదల వుతుందో మాత్రం గ్యారెంటీగా చెప్పలేను’’ అని దర్శకుడు రాజమౌళి తన సినిమా రిలీజ్‌ డేట్స్‌పై సరదాగా జోక్‌ చేస్తుంటారు. దానికి కారణం ఆయన సినిమాలన్నీ అనుకున్న తేదీకి ఎక్కువ శాతం విడుదల కాకపోవడమే. ఇప్పుడు తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా వేరే డేట్‌కి రిలీజ్‌ కానుందనే టాక్‌ నడుస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం వికారాబాద్‌ అడవుల్లో ఎన్టీఆర్, చరణ్‌లపై ఓ యాక్ష¯Œ  సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఈ ఏడాది జూలై 31న విడుదలæ చేయాలనుకున్నారు. ఇప్పుడు అక్టోబర్‌ 2న విడుదల కానుందని తెలిసింది. అక్టోబర్‌ 2 నేషనల్‌ హాలిడే (గాంధీ జయంతి) కావడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ ఓపెనింగ్స్‌ కొల్లగొడుతుందని ఊహించవచ్చు. సుమారు 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement