ఆటకు ‘సై’ : రాజమౌళి | Rajamouli Shared Kabaddi Team Nalgonda Eagles Theme Song | Sakshi
Sakshi News home page

Sep 11 2018 12:07 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli Shared Kabaddi Team Nalgonda Eagles Theme Song - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి మరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్‌ 2లో ఓ జట్టును తీసుకున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి, కుమారుడు కార్తికేయలతో కలిసి నల్లగొండ ఈగల్స్‌ టీంను సొంతం చేసుకున్న జక్కన్న టీం ప్రొమోషన్‌ను కూడా సినిమాటిక్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా తమ టీంను ప్రమోట్ చేస్తూ ఓ థీమ్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డి సీజన్‌ 2 ఈ నెల 14 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. 16 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్‌లో 8 టీంలు పాల్గొననున్నాయి. సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో నల్లగొండ ఈగల్స్‌తో పాటు  హైదరాబాద్‌ బుల్స్‌, రంగారెడ్డి రైడర్స్‌, వరంగల్‌ వారియర్స్‌, కరీంనగర్‌ కింగ్స్‌, గద్వాల్‌ గ్లాడియేటర్స్‌, పాలమూరు పాంతర్స్‌, మంచిర్యాల టైగర్స్‌ తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement