పెళ్లి తరువాత తొలి ట్వీట్ | Rahul Sharma tweet about Asin | Sakshi
Sakshi News home page

పెళ్లి తరువాత తొలి ట్వీట్

Jan 27 2016 11:39 AM | Updated on Sep 3 2017 4:25 PM

పెళ్లి తరువాత తొలి ట్వీట్

పెళ్లి తరువాత తొలి ట్వీట్

ఇటీవల కాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పెళ్లి వార్త అసిన్, రాహుల్ శర్మలది. ఇద్దరు సెలబ్రిటీలు కావటంతో నేషనల్ మీడియా కూడా వీరి పెళ్లి విశేషాలను ప్రముఖంగా ప్రసారం...

ఇటీవల కాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పెళ్లి వార్త అసిన్, రాహుల్ శర్మలది. ఇద్దరు సెలబ్రిటీలు కావటంతో నేషనల్ మీడియా కూడా వీరి పెళ్లి విశేషాలను ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ నెల 19న కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఒక్కటైన ఈ ప్రేమ జంట, ఆ తరువాత మీడియాకు దూరంగా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్ట్లు చేయలేదు. అసిన్ పెళ్లి ఫోటోలతో కాస్త హడావిడి చేసినా... రాహుల్ శర్మ మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

పెళ్లి కార్యక్రమాలు పూర్తయి వారం రోజులు అవుతుండగా రాహుల్ శర్మ తొలి ట్వీట్ చేశాడు. అసిన్ను కౌగింలించుకొని ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాహుల్ ' నా ప్రపంచాన్ని నా చేతులతో పట్టుకున్నాను' అంటూ కామెంట్ చేశాడు. అసిన్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ కాగా, రాహుల్ శర్మ ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్కు కో ఫౌండర్గా ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement