పలాస నాకు చాలా ప్రత్యేకం

Raghu Kunche  About Palasa 1978 Movie - Sakshi

‘‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో కమల్‌హాసన్‌గారి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రని ‘పలాస 1978’ చిత్రంలో చేశా. కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఒక నటుడిగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇందులో సంగీతం కోసం సహజమైన వాయిద్యాలు వాడాం’’ అన్నారు రఘు కుంచె. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌  అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్ష¯Œ ్స ద్వారా రేపు (శుక్రవారం) విడుదల కానుంది.

ఈ చిత్రంలో విలన్‌గా నటించడంతో పాటు సంగీతం అందించిన రఘు కుంచె మాట్లాడుతూ– ‘‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘పలాస’ నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో మైండ్‌ గేమ్‌ ఆడే విలన్‌ పాత్రలో మేకప్‌ లేకుండా సహజంగా నటించాను. ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్‌ అవసరం లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా ‘పలాస 1978’ నా కెరీర్‌లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాతో ఐదుగురు కొత్త గాయకుల్ని పరిచయం చేస్తున్నాం.

జానపద కళ ఉన్న సినిమా కావడంతో ఫ్రెష్‌నెస్‌ కోసం కొత్తవారిని తీసుకున్నాం. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి స్పందన వచ్చింది. నాకు మొదటి నుండి ఫోక్‌ సాంగ్స్‌ అంటే ఇష్టం. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫోక్‌ సాంగ్స్‌ పాడటం అలవాటు.. అలా గాయకుణ్ణి అయ్యాను. నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేసిన సినిమాల్లో ఫోక్‌ సాంగ్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. ‘పలాస’ ప్రివ్యూ చూసిన తర్వాత కొందరు దర్శక–నిర్మాతలు ఫోన్‌ చేసి, మంచి పాత్రలున్నాయి చేయమని అడిగారు. ఆ వివరాలు త్వరలోనే చెబుతా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top